లోయలో పడిన ట్రాక్టర్​.. తొమ్మిది మంది దుర్మరణం

by Shiva |   ( Updated:2023-05-30 06:22:35.0  )
లోయలో పడిన ట్రాక్టర్​.. తొమ్మిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ లోయలో పడి తొమ్మిది మంది దుర్మరణం పాలైన ఘటన రాజస్థాన్ రాష్ట్రం, జుంజు జిల్లాలోని ఉదయపూర్వతి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉదయ పూర్వతిలో ఓ కుటుంబం ఆలయానికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు లోయలో పడిపొయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దాదాపు మరో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలను ఆరంభించారు.

Advertisement

Next Story