Up News: 'ప్రశాంతగా బతకలేకపోతున్నా'.. చోరీ చేసిన విగ్రహాలు వెనక్కి ఇచ్చేసిన దొంగ

by Prasad Jukanti |   ( Updated:2024-10-02 13:41:56.0  )
Up News:  ప్రశాంతగా బతకలేకపోతున్నా.. చోరీ చేసిన విగ్రహాలు వెనక్కి ఇచ్చేసిన దొంగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి విగ్రహాలను చోరీ చేసిన ఓ దొంగ వాటిని తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. దీనికి అతడు చెప్పిన కారణం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విచిత్ర ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో సంభవించింది. ప్రయాగ్‌రాజ్ జిల్లా నవాబ్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రసిద్ధ గౌఘాట్ ఆశ్రమంలో ఉన్న రాధాకృష్ణుడి విగ్రహాలు గత నెల 23 రాత్రిన చోరీకి గురయ్యాయి. ఈ విషయం గ్రహించిన అక్కడి మహరాజ్ ఆ మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందిలా నిన్న సాయంత్రం ఆశ్రమ రహదారి వద్ద ఓ వ్యక్తి గోనె సంచిని విదిలిపెట్టి పరుగెత్తుకుంటే వెళ్లిపోయాడు. అది గమనించిన స్థానికులు తొలు భయపడినా ఆ తర్వాత ధైర్యం చేసి దాన్ని తెరిచి చూశారు. అందులో రాధాకృష్ణుడి విగ్రహాలు ఉండటం చూసి ఆశ్రమ మహరాజ్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సంచిని పరిశీలించగా అందులో వారికి ఓ లేఖ సైతం కనిపించింది.

దొంగతనం చేసినప్పటి నుంచి తనను పీడకలలు వెంటాడుతున్నాయని, ప్రశాంతంగా తినలేకపోతున్నాను, నిద్ర పోలేకపోతున్నాను అలాగే తన భార్య, పిల్లలు అనారోగ్యం పాలయ్యారని లేఖలో పేర్కొన్నారు. అందువల్లే ఈ విగ్రహాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రాసుకొచ్చాడు. అలాగే తాను చేసిన తప్పుకు దేవుళ్లను, మహారాజ్ ను క్షమాపణలు కోరారు. మహారాజ్ జీ.. నేను పెద్ద తప్పు చేశాను. నేను కొంత డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడ్డాను కానీ దొంగతనం చేసినప్పటి నుంచి తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ తిరిగి విగ్రహాన్ని వెనక్కి ఇచ్చేశాడు. చోరీకి గురైన దేవుడి విగ్రహలు తిరిగి దక్కడంతో ఆ విగ్రహానికి ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయంలో స్థాపించారు.

Advertisement

Next Story