chhattisgarh: పంద్రాగస్టు వేడుకల్లో వదిలిన పావురం ఎగరలేదని చర్యలకు ఎస్పీ డిమాండ్

by Prasad Jukanti |
chhattisgarh: పంద్రాగస్టు వేడుకల్లో వదిలిన పావురం ఎగరలేదని చర్యలకు ఎస్పీ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పావురాలను శాంతికి సూచనగా భావిస్తుంటారు. అందువల్ల వివిధ అధికారిక కార్యక్రమాలలో పావురాలను పైకి ఎగురవేసి వేడుకలను ప్రారంభించడం మన దేశంలో ఓ సంప్రదాయంగా వస్తోంది. అయితే తాజాగా జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తాను వదిలిన పావురం ఎగురలేదని అందువల్ల దీనిని తీసుకువచ్చిన బాధ్యుతలపై క్రమశిక్షణా చర్యలకు జిల్లా ఎస్పీ డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ముంగేళి జిల్లాలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పన్నూలాల్ మోహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ముగ్గురు వేర్వేరు పావురాలను పైకి వదిలి వేడుకలను ప్రారంభించారు. మిగతా ఇద్దరు వదిలిన పావురాలు రయ్యుంటూ ఆకాశంలోకి ఎగిరిపోగా ఎస్పీ వదిలి పావురం మాత్రం పైకి ఎగరకుండా అక్కడే కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు వెరైటీ కామెంట్స్ పెట్టారు. దీంతో ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ అనార్యోగ్యంతో ఉన్న పావురం కారణంగానే ఇలా జరిగిందని, ఒక వేళ ఇదే చీఫ్ గెస్ట్ చేతిలోని పావురం కింద పడి పోయి ఉంటే పరిస్థితి ఏంటి? కీలకమైన కార్యక్రమాంలో అనారోగ్యంతో కూడిన పావురం తీసుకువచ్చిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సదరు ఎస్పీ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed