ముస్లింల పరిస్థితి పాకిస్థాన్ కంటే భారత్‌లోనే చాలా బెటర్: నిర్మలా సీతారామన్

by Mahesh |
ముస్లింల పరిస్థితి పాకిస్థాన్ కంటే భారత్‌లోనే చాలా బెటర్: నిర్మలా సీతారామన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారతదేశంలో ముస్లిం, మైనార్టీలపై హింస జరుగుతోందంటూ వెస్టర్న్ దేశాల్లో వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీవ్ర ద్రవ్యనిధి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొనేందుకు నిర్మాలా సీతారామన్ వాషింగ్టన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన పీటర్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై పలువురు ఆమెను ప్రశ్నించగా...సీతారామన్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్‌. వారి సంఖ్య పెరుగుతోంది కూడా.

వారి జీవితాలు కష్టంగా ఉంటే..ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా?ఆనాడు ఇస్లామిక్‌ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి సంఖ్య నానాటికీ పడిపోతోంది. కానీ, మా దేశంలో ఆ పరిస్థితి లేదు. మా దగ్గర శాంతి భద్రతలనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. తన వ్యాపారం చేస్తూ తన పిల్లలకు చదువులు, ఫెలోషిప్ కూడా ఇస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏ మాత్రం తెలుసుకోకుండా ఇలా దేశాన్ని నిందించడం సరికాదు’అని ఆమె మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed