- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సీనియర్ వైద్యులు
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్(West Bengal) లోని కోల్‌కతాలో జరిగిన ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముందు నుండి బెంగాల్ ప్రభుత్వం ముందు నుండి తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని ఆ రాష్ట్రంలోని జూనియర్ వైద్యులు ఘటన జరిగిన నాటినుండి నిరసనలు వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బెంగాల్ ప్రభుత్వానికి సీనియర్ ప్రభుత్వ వైద్యులు భారీ షాక్ ఇచ్చారు. ట్రైనీ వైద్యురాలి ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పు పడుతూ 50 మంది ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాలలోని సీనియర్ వైద్యులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వీరంతా రాజీనామాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే జూనియర్ వైద్యులు నిరహార దీక్షలు చేపట్టగా.. వారికి సంఘీభావంగా సీనియర్ వైద్యులు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనతో మెడికల్ కళాశాలలోని అన్ని వైద్య సేవలు ఒక్కసారిగా ఆగిపోగా.. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.