కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని కిందకి తోసిన రైల్వే సిబ్బంది..

by sudharani |
కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని కిందకి తోసిన రైల్వే సిబ్బంది..
X

దిశ, వెబ్‌డెస్క్: రైలులోని ప్రయాణికుడికి, ప్యాంట్రీకి ఓ వాటర్ బాటిల్ గురించి వచ్చిన గొడవలో.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని కిందకి తోసేశాడు ప్యాంట్రీ సిబ్బంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ లో చోటుచేసుకుంది. రవి యాదవ్ (26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తు్నాడు. ఈ క్రమంలో వాటర్ బాటిల్, గుట్కా విషయంలో రైల్వే ప్యాంట్రీ సిబ్బందికి, రవికి మధ్య గొడవ తలెత్తింది. కాగా, వాళ్లు దిగాల్సిన లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి యాదవ్ సోదరి దిగిపోగా, అతడిని మాత్రం సిబ్బంది దిగనివ్వలేదు. అంతేకాక రైలు కదిలిన తర్వాత విచక్షణ రహింతంగా వ్యవహారించి అందులో నుంచి కిందకి తోసేశారు. దీంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని గమనించిన కొంత మంది రవిని ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు మొదలు పెట్టారు.

Advertisement

Next Story