- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Elephants:పొలంలో మేతకు వెళ్లిన ఏనుగులు మృతి.. కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఏనుగుల(elephants) వరుస మరణాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(BTR)లో ఈ వారంలోనే పది ఏనుగులు మృత్యువాత పడటం సంచలనంగా మారింది. అయితే అధికారులు వీటి మరణాలకు సంబంధించిన కారణాలు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిన్న(శుక్రవారం) అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ప్రకారం అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు.
మృతి చెందిన ఏనుగులకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించగా మైకో టాక్సిన్స్(Mycotoxins) కారణంగానే ఏనుగులు(elephants) మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. అరికెల పొలాలు, ఏనుగులు నీళ్లు తాగిన నీళ్ల నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపారు. అరికెల పంటకు పురుగులు పట్టకుండా వాడిన రసాయనాల్లో మైకోటాక్సిన్స్ ఉండడం వల్ల ఆ పంటను తిన్న ఏనుగులు మృతి చెంది ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పది ఏనుగుల్లో నాలుగు మంగళవారం మృతి చెందగా, మరో నాలుగు బుధవారం, రెండు గురువారం మరణించాయి. మరో మూడు ఏనుగుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.