ఇదేం పనిరా నాయన.. ఓయో రూమ్స్ క్లోజ్ చేశారని పార్క్ లో అడ్డా పెట్టిన లవర్స్.. ఎమ్మెల్యే ఎంట్రీతో సీన్ రివర్స్ (వీడియో)

by Prasad Jukanti |   ( Updated:2024-04-23 13:21:02.0  )
ఇదేం పనిరా నాయన.. ఓయో రూమ్స్ క్లోజ్  చేశారని పార్క్ లో అడ్డా పెట్టిన లవర్స్.. ఎమ్మెల్యే  ఎంట్రీతో సీన్ రివర్స్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్నా మొన్నటి వరకు లవర్స్ కు బెస్ట్ డెస్టినేషన్ గా పార్కులు ఉండేవి. కానీ ఓయో రూమ్స్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. కేవలం ఐడీ ఫ్రూప్స్ ఇస్తే చాలు ఎవరైనా? ఎవరితోనైనా? ఓయో రూమ్స్ లో గడిపే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు వల్ల చాలా మంది లవర్స్ పార్కులను వదిలి ఓయో రూమ్స్ కు క్యూ కడుతున్నారు. ఇంత వరకు వరకు బాగానే ఉన్న ఓ చోట మాత్రం ఓయో రూమ్స్ క్లోజ్ చేశారని పార్క్ లను అడ్డాగా మార్చుకుంటున్నారు కొంత మంది యువతీ యువకులు. ప్రైవేట్ గా పార్కులో ఉన్న జంటలకు తాజాగా ఛత్తీస్ గఢ్ లోని వైశాలి నగర్ ఎమ్మెల్యే రికేష్ సేన్ షాకిచ్చారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ పార్కులోకి వెళ్లారు. అక్కడ ఉన్న యువతీ యువకులను ఇక్కడేం చేస్తున్నారని ఇదేమన్న మీ అడ్డానా అని ప్రశ్నించగా వారిచ్చిన వింత సమాధానాలు విని ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పార్కులో ఉన్న జంటల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా ఓయో రూమ్స్ బంద్ చేశారని అందుకే ఇక్కడ మాట్లాడుకోవడానికి వచ్చామని ఓ జంట బదులించ్చింది. ఆ తర్వాత మరో జంట వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఆ అమ్మాయి ఎవరని యువకుడిని ప్రశ్నించగా నా గర్ల్ ఫ్రెండ్ అని బదులిచ్చాడు. అయితే ఇక్కడేం చేస్తున్నారని ఎమ్మెల్యే అడగ్గా.. ఓయోతో పాటు అన్ని బంద్ చేసి పెట్టారని దాంతో తమకు ఇబ్బందిగా మారిందని ఎక్కడికైనా వెళ్లాలంటే మాకు భయంగా ఉందని చెప్పుకొచ్చాడు. మేము ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి కనీసం పార్కులనైనా వదిలిపెట్టాలని కోరారు. వారి వింత సమాధానాలు విన్న ఎమ్మెల్యే ఇది మంచి పద్దతి కాదని ముందు మీ చదువులపై దృష్టి సారించాలని హెచ్చరించారు, మీ వల్ల పార్కుల్లోకి వచ్చేందుకు మహిళలు, చిన్నారులు ఇబ్బందులు బడుతున్నారని మరోసారి ఇటువైపు రావొద్దంటూ వారికి అక్కడి నుంచి పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. యవతీ యువకులు పార్క్‌లు లేదా బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించకూడదని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. నేటి యువతకు ఓయో అవసరం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఎమ్మెల్యే చేసింది మంచి పని అని .. చాలా మంది జంటలు పార్కుల్లో మంచి వాతావరణాన్ని పాడు చేస్తు పరమ రోతగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మరికొందరు ఇది స్క్రిప్టేడ్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Click Here for Twitter video

Advertisement

Next Story

Most Viewed