First Night: 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేకుంటే నీకు నాకు రాంరాం..

by Indraja |
First Night: 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేకుంటే నీకు నాకు రాంరాం..
X

దిశ వెబ్ డిస్క్; పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. పెళ్లంటే పంట కాదు నూరేళ్ళ మంటని నిరూపిస్తున్నారు కొందరు మూర్ఖులు. కాలం మారిన.. ఆడపిల్లల తల్లిదండ్రులకు వరకట్నం బాధ తీరడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కానీ చిటికెడు సంస్కారాన్ని అలవర్చుకోలేక.. ఇసుమంత ఇంకితజ్ఞానాన్ని పెంపొందించుకోలేక మనిషి రూపంలో ఉన్న రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం తాళి కట్టడానికే కాదు కాపురం చెయ్యడానికి కూడా కట్నం కావాలంటున్నాడు ఓ మూర్ఖుడు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక లోని బసవనగుడి చెందిన అవినాష్ అనే యువకుడితో ఓ యువతికి వివాహం జరిగింది. అవినాష్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. కాగా పెళ్ళికి ముందు కట్న కానుకులు ఏమి వద్దని చెప్పారు అవినాష్. అయితే పెళ్లి జరిగిన తరువాత 15 లక్షల కట్నం ఇవ్వాలని.. 15 లక్షలు ఇస్తేనే శోభనం అని తెగేసి చెప్పారు. అల్లుడి వేధింపులు తట్టుకోలేక.. కూతురు జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని యువతి తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు ఇచ్చారు. అయినా అవినాష్ తృప్తి చెందలేదు. మిగిలిన నగదు ఇస్తేనే శోభనం జరుగుతుందని, లేకపోతే జరగదని యువతిని హింసించాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది యువతి.

Advertisement

Next Story