Muda scam: కష్టాల్లో సీఎం.. సిద్ధరామయ్యను విచారించేదుకు గవర్నర్ అనుమతి

by Harish |
Muda scam: కష్టాల్లో సీఎం.. సిద్ధరామయ్యను విచారించేదుకు గవర్నర్ అనుమతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో గత కొంత కాలంగా మైసూరు భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూమి కేటాయింపులో జరిగిన అవకతవకల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శనివారం అనుమతి ఇచ్చారు.

ముడా భూ కుంభకోణం కేసులో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ప్రాసిక్యూషన్‌ను ఆమోదించారు. అలాగే, టీజే అబ్రహంను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో కలవాలని ఆదేశించారు. రాష్ట్ర సీఎంపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. దీనిపై సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) కూడా ధృవీకరించింది.

కేసు నేపథ్యం,

2021లో, మైసూరులోని కేసరే గ్రామంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూరులోని విజయనగర్ ప్రాంతంలో ప్లాట్లు కేటాయించారు. అయితే ఆమెకు కేటాయించన ప్లాట్‌ల విలువ కేసరలో ఆమె అసలు భూమి కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా ఆమెకు అధిక విలువ కలిగిన భూకేటాయింపులు చేశారని విమర్శలు వచ్చాయి. ఈ మొత్తం స్కాం విలువ రూ.4000 కోట్లకు పైగా ఉంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed