- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
School Holidays:వారం రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యూపీలో హరిద్వార్‌లో కన్వర్ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని అన్ని పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ జూలై 23వ తేదీన ఈ మేరకు సమాచారాన్ని అందించారు. అయితే కన్వర్ యాత్ర మార్గంలో వచ్చే అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, కళాశాలలను మాత్రమే జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కన్వర్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు. హరిద్వార్‌లోని వివిధ వాహనాల్లో ప్రధాన రహదారుల గుండా గంగా జలాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో శివ భక్తులు ఇక్కడికి వస్తారు. దీంతో ఆ రూట్లలో అధిక రద్దీ ఉండే చాన్స్ ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ధీరజ్ సింగ్ గర్బ్యాల్ తెలిపారు.