ఎట్టకేలకు పూరీ జగన్నాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్: హాజరైన ఒడిశా సీఎం

by vinod kumar |
ఎట్టకేలకు పూరీ జగన్నాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్: హాజరైన ఒడిశా సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా రాష్ట్రం పూరీలోని జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను గురువారం తెరిచారు. కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో మాఝీ ప్రత్యేక పూజలు చేశారు. పూరీ ఎంపీ సంబిత్ పాత్ర, బాలాసోర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, ఇతర మంత్రులు, పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో జగన్నాథ ఆలయానికి సంబంధించిన నాలుగు ద్వారాలను తెరవాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఓపెన్ చేశారు. దీంతో భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు.

కాగా, కరోనా కాలంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ నాలుగు ద్వారాలను మూసి వేశారు. అప్పటి నుంచి ఆలయంలో పెద్ద ఎత్తున జనం, క్యూలైన్లు ఉండేవి. దీంతో అన్ని గేట్లను తెరవాలని భక్తులు చాలా కాలంగా డిమాండ్ చేశారు. అయితే బీజేడీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే ఆలయ ద్వారాలను తెరుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అనంతరం తొలి కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్నాథ ఆలయ ద్వారాలను తెరవాలని ఆదేశించారు. అంతేగాక ఆలయ నిర్వహణకు రూ.500 కోట్ల నిధిని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed