మద్యం మత్తులో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకడంతో..

by Sathputhe Rajesh |
మద్యం మత్తులో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకడంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకాంక్ - ముంబై ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తిని స్వీడిష్ జాతీయుడిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో జోనాస్ వెస్ట్ బర్గ్(62) ప్రయాణిస్తున్నాడు. ఆహారం విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు.

అతడు కోరుకున్న ఫుడ్ లేదని చెప్పడంతో వివాదం మొదలైంది. చికెన్ విక్రయించేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ అతడి వద్దకు రాగా నిందితుడు ఆమె చేతిని అసభ్యకరంగా తాకాడు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు మరో ప్రయాణికుడిపై దాడి చేశాడు. దీంతో ముంబాయి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గత మూడు నెలలలో భారత విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఎనిమిదో సారి కావడం కలవరపెడుతోంది.

Advertisement

Next Story