- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వామీజీ మాట్లాడుతుండగానే మైక్ లాక్కున్న CM.. వైరలవుతోన్న వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో: కాగినేలే మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానందపురీ స్వామీజీ వేదికపై మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి కర్ణాటక సీఎం బసవరాజ్‌బొమ్మై మైకును లాగేసుకున్నారు. గురువారం ఈశ్వరానందపురీ స్వామీజీతో కలిసి ఓ కార్యక్రమంలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారుల తీరుపై విమర్శలు చేశారు. 'బెంగళూరులో భారీ వర్షాలు వచ్చిన సమయంలోనే ప్రజాప్రతినిధులు, బీబీఎంపీ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. చాలాసార్లు ఈ తీరు చూశాం. అయితే, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోలేదు. అసలు సమస్య ఏంటన్న విషయాన్ని అధికారులు గ్రహించలేదా? పరిష్కార మార్గాన్ని కనుగొనలేరా? దీనికి శాశ్వత పరిష్కారం చూపుతానని సీఎం అన్నారు.
కేవలం హామీ ఇవ్వడాన్ని మేము అంగీకరించబోము' అని ఈశ్వరానందపురీ స్వామీజీ చెప్పారు. అనంతరం స్వామీజీ ఏదో మాట్లాడుతుండగా ఆయన చేతిలో నుంచి సీఎం బొమ్మై చిరాకుగా మైకును తీసుకున్నారు. 'హామీ ఇవ్వడమే కాదు. మేము ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాము. నిధులు కేటాయించాం. పనులు కూడా ప్రారంభమయ్యాయి. నేను గత సీఎంలలా కేవలం హామీలు ఇచ్చి వదిలేయను. చెప్పింది చేస్తాము.. నేను ఎవ్వరికీ భయపడను' అని బొమ్మై అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.