- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం కేంద్రం కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం గత పదిరోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా శ్రమిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దాదాపు 16వేల మంది.. బతుకు జీవుడా అంటూ స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. వీరంతా ఎంబీబీఎస్ మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు చదువుతున్న వారే ఉన్నారు. సాఫీగా సాగుతున్న విద్యాభ్యాసం యుద్ధం కారణంగా చదవును మద్యలోనే వదిలేసి దేశాన్నే వదిలి వచ్చేలా చేసింది. దీంతో అప్పులు చేసి మరీ చదివించిన తల్లిదండ్రుల ఆశలు నీరుగారిపోయాయి. ఈ నేపథ్యంలో వీరి తదుపరి విద్యాభ్యాసంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో మొదలైంది.ఈ క్రమంలో వేల సంఖ్యలో ఉన్నందున వారి విద్యాభ్యాసం కొనసాగింపునకు అవకాశం ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోడీకి సిఫారసు చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారికి ఇంటర్న్‌షిప్‌కు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఎంబీబీఎస్ మధ్యలో ఉన్నవారికి ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర నిర్ణయంతో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలగనుంది. అయితే, దీనిపై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యను చదివించలేకనే విదేశాలకు పంపామని, ఫీజులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కేంద్రానికి అభ్యర్థిస్తున్నారు. ఈ విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాల్సి ఉంది.