- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదలైన మోడీ 3.0 కేబినెట్ ఫస్ట్ భేటీ.. తొలి సమావేశంపై తీవ్ర ఉత్కంఠ..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో నూతన కేంద్ర మంత్రులతో మోడీ భేటీ అయ్యారు. పార్లమెంట్ తొలి సెషన్, కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో 100 రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికపై నూతన మంత్రులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత జరుగుతోన్న ఫస్ట్ కేబినెట్ భేటీ కావడంతో పాటు.. ఈ సమావేశంలోనే నూతన మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ ఏ శాఖలు ఎవరికీ కేటాయిస్తారు..? కీలకమైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు వంటి ఫోర్ట్ ఫోలియోలు ఎవరి కట్టబెడతారు..? తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఐదుగురు మంత్రులకు ఏ శాఖలు దక్కుతాయానే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. మోడీ 3.0 ఫస్ట్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.