పెళ్లి పందిట్లోనే చెంపలు చెళ్లుమనిపించుకున్న వధువు, వరుడు (వీడియో)

by Anjali |   ( Updated:2023-04-21 03:34:14.0  )
పెళ్లి పందిట్లోనే  చెంపలు చెళ్లుమనిపించుకున్న వధువు, వరుడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పెళ్లిళ్లలో అనూహ్య ఘటనటు మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం పెళ్లి పీఠలపై వధువు, వరుడు చేసే విన్యాసాలు కొన్నిసార్లు నెటిజన్లను ఆకట్టుకోగా.. కొన్నిసార్లు విమర్శలకు తావిస్తుంటాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే మరోచోట చోటుచేసుకుంది. పెళ్లి పీఠలపై వధువు, వరుడు చెంపచెల్లుమనిపించుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా పెళ్లిలో వధువు, వరుడు స్వీట్ తీనిపించుకోవడం ఆచారం. అలాగే వైరల్ అవుతోన్న ఓ పెళ్లి వీడియోలో వరుడు.. వధువుకు తీపి పదార్థం తీనిపిస్తుండగా అతడి చేయి ఆమె పెదాలకు తగలడంతో పెళ్లికూతురు విరుచుకుపడింది. అయినా అంతటితో ఆగకుండా ఆ వరుడు నోట్లో బలవంతంగా కుక్కే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె వరుడి చెంప చెల్లుమనిపించింది. కోపాద్రికుడైన వరుడు తిరిగి ఆమె చెంప మీద తీవ్రంగా కొట్టాడు. ఇలా ఇద్దరు దారుణంగా పెళ్లి పీటలపైనే కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరు వివాహం చేసుకునే అర్హత లేదని, చేసుకొన్న జీవితాంతం కలిసి ఉండలేరని, మరికొందరు ఇది నిజంగా జరిగిందా? అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story