తెలివికి హ్యాట్సాఫ్.. చిరుతపులిని గదిలో బంధించిన బుడ్డోడు (వీడియో)

by GSrikanth |
తెలివికి హ్యాట్సాఫ్.. చిరుతపులిని గదిలో బంధించిన బుడ్డోడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో చిరుత పులలు సంచారం జనావాసాల్లో భారీగా పెరిగిపోయింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా.. మహారాష్ట్ర మాలేగావ్‌లోని ఒక కల్యణమండపం గదిలోకి చిరుతపులి వచ్చింది. అదే సమయంలో గదిలో మొబైల్ ఫోన్‌లో మునిగిపోయిన ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి దాన్ని గదిలోనే బంధించాడు. ఆ కల్యాణ మండపానికి ఆ బాలుడి తండ్రి వాచ్‌‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. చిరుతపులి గదిలోకి వచ్చిన సమయంలో గదిలో బాలుడు ఒక్కడే ఉన్నాడు. మొబైల్‌లో లీనమైపోయిన ఆ బాలుడికి చిరుతపులి గదిలోకి జొరబడిన వెంటనే భయంతో పరుగులు తీయలేదు. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి బయటకు వెళ్లి తలుపును వేసేశాడు. ఇదంతా గదిలోపలున్న సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో చిరుతపులి ఆ గదిలోనే బందీ అయింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం వెళ్ళడంతో ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి దాన్ని బంధించి తీసుకెళ్ళిపోయారు.



Advertisement

Next Story