- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపీకలో ట్విస్ట్.. చివరి నిమిషంలో పరిశీలకులను నియమించిన బీజేపీ
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా యుతి కూటమి ఎవరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే మాజీ సీఎం ఎక్ నాథ్ షిండే ఇప్పటికే సీఎం ఎవరైన తనకు అభ్యంతరం లేదని.. సీఎం పదవిపై బీజేపీ అధిష్టానం దే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు. దీంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై నేడు క్లారిటీ రానుందని అందరూ భావించారు. కానీ బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో పరిశీలకులను నియమించింది. ఇందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీని పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. దీంతో ఈ నెల 4వ తేదీన జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ వ్యవహరించనుండగా.. అదే రోజు.. మహారాష్ట్రకు కాబోయే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.