మణిపూర్‌లో 70 ఇళ్లు, అవుట్‌పోస్ట్‌లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు

by Harish |
మణిపూర్‌లో 70 ఇళ్లు, అవుట్‌పోస్ట్‌లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌‌లోని జిరిబామ్ జిల్లాలో రెండు పోలీసు అవుట్‌పోస్టులు, ఒక అటవీ కార్యాలయం, 70 ఇళ్లకు అనుమానిత ఉగ్రవాదులు నిప్పుపెట్టారు. దీంతో గ్రామాల ప్రజలు అక్కడి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండటానికి, భద్రతా సిబ్బందికి సహాయం చేయడానికి 70 మందికి పైగా రాష్ట్ర పోలీసు కమాండోలతో కూడిన బృందాన్ని ఇంఫాల్ నుండి జిరిబామ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనందుకు జిరిబామ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. ఉద్రిక్తతల మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు శుక్రవారం నాడే జిరిబామ్‌లోని పరిధీలో దాదాపు 239 మంది మహిళలు, పిల్లలను ఖాళీ చేయించి, జిల్లాలోని మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి తరలించారు.

సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, అనుమానిత ఉగ్రవాదులు లామ్‌టై ఖునౌ, దిబాంగ్ ఖునౌ, నుంఖాల్, బెగ్రా గ్రామాల్లో దాడి చేశారని తెలిపారు. ఈ హింసాత్మక సంఘటనలపై ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానం నుండి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా మాట్లాడుతూ, అల్లర్లు మరింత పెద్దగా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలను, వారి ఆస్తులను రక్షించాలని కోరారు. అనుమానిత ఉగ్రవాదులు 59 ఏళ్ల వ్యక్తిని చంపిన తర్వాత గురువారం సాయంత్రం జిరిబామ్‌లో మళ్లీ హింస చెలరేగింది.

Advertisement

Next Story

Most Viewed