సైనికుల మృతికి కారకులను.. వెంటాడి వేటాడి అంతం చేస్తాం: రాజ్‌నాథ్

by Mahesh |
సైనికుల మృతికి కారకులను.. వెంటాడి వేటాడి అంతం చేస్తాం: రాజ్‌నాథ్
X

జమ్మూ : కాశ్మీర్ లో సైనికుల మృతికి కారణమైన ఉగ్రవాదులను ఆరు నూరైనా వెంటాడి వేటాడి అంతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ఎవరు యత్నించిన వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. శనివారం కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ రాజౌరీలోని ఆర్మీ డివిజన్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ నార్తర్న్ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఫీల్డ్ కమాండర్లు వివరించారు.

అనంతరం ఆర్మీ జవాన్లతో ఆయన సంభాషించారు. “ఈ రోజు రాజౌరిలోని ఆర్మీ బేస్ క్యాంపును సందర్శించాను. సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించాను. భారత సైన్యంలోని వీర జవాన్లతో సంభాషించాను. మన మాతృ భూమిని రక్షించడం పట్ల వారికి ఉన్న అంకితభావానికి భారతదేశం సెల్యూట్ చేస్తోంది” అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదులపై జరుగుతున్న ఆపరేషన్‌లో ఆర్మీ ఒక ఉగ్రవాదిని శుక్రవారం రాత్రి హతమార్చగా, మరొకరికి గాయాలు అయినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed