జమ్మూలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆర్మీ కాన్వాయ్‌పై దాడి

by GSrikanth |   ( Updated:2023-12-21 12:25:40.0  )
జమ్మూలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆర్మీ కాన్వాయ్‌పై దాడి
X

దిశ, వెబ్‌‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనంపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. గురువారం పూంచ్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ప్రస్తుతం జవాన్లు, ఉగ్రవాదాలుకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కాల్పులు జరుగుతున్న ప్రదేశానికి అదనపు బలగాలను సైన్యం పంపిస్తోంది. కాగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. తాజా ఘటనలో ప్రాణనష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story