- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలి: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎస్ఎస్ఏ) అజిత్ ధోవల్ నొక్కి చెప్పారు. కజఖస్తాన్‌లోని అస్తానాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) బుధవారం నిర్వహించిన ఎన్‌ఎస్‌ఏల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. అనేక శతాబ్దాల నాటి సభ్య దేశాలతో సంబంధాలను మరింత మెరుగు పర్చుకోవడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీవో సభ్యదేశాల సార్వభౌమాధికారం, సమగ్రతలను భారత్ గౌరవిస్తుందని తెలిపారు. ఈ దేశాలతో కనెక్టివీటిని పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత నెల 22న రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాలులో జరిగిన ఉగ్రదానికి దోవల్ తీవ్రంగా ఖండించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే వారితో సహా ఉగ్రవాదానికి పాల్పడేవారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఉగవాదంపై ధ్వంద ప్రమాణాలను విస్మరించాలని తెలిపారు.