కేజ్రీవాల్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్!: ఆప్ నేతల ఆందోళన

by samatah |   ( Updated:2024-01-04 03:32:49.0  )
కేజ్రీవాల్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్!: ఆప్ నేతల ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరుసగా మూడో సారి గైర్హాజరైన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ నివాసంలో గురువారం ఈడీ దాడులు నిర్వహించి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు ఆరోపించారు. ‘ఈడీ కేజ్రీవాల్ నివాసంపై దాడి చేయబోతుంది. అలాగే అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. తమకు ఇప్పటికే పూర్తి సమాచారం అందింది’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. మరో నేత సౌరభ్ భరద్వాజ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేసినట్టు తెలుస్తోంది. భద్రతను సైతం కట్టుదిట్టం చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో నేడు ఏం జరగనుందోనని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story