ప్రజలు పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు

by Prasanna |   ( Updated:2023-11-30 12:25:11.0  )
ప్రజలు పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు
X

న్యూఢిల్లీ: బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించే పారదర్శకమైన, ప్రజాహిత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె అన్నారు. గురువారం తెలంగాణలో పోలింగ్ నేపథ్యంలో ఆయన ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ ఆలోచనను అమలు చేసే విషయంలో ఏ శక్తీ ఆపలేదని, ఇప్పుడు ప్రజా తెలంగాణను నిర్ధారిద్దాం. ఇది సాకారమయ్యేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలను సాకారం చేయాల్సిన సమయం ఇదేనని, మార్పు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్దతిలో పాల్గొనేందుకు ప్రతి ఒక్క ఓటరును స్వాగతిస్తున్నట్టు ఖర్గె పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణ ప్రజలు అందరూ ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సైతం తెలంగాణ ప్రజలు ఆలోచించి, పూర్తి ఉత్సాహంతో ఒటు వేయాలని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story