'ఆత్మనిర్భర్ భారత్' దిశగా మరో ముందడుగు.. ‘అస్త్ర’ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ ఫుల్..

by Vinod kumar |
ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు.. ‘అస్త్ర’ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ ఫుల్..
X

న్యూఢిల్లీ : "ఆత్మనిర్భర్ భారత్" దిశగా మరో ముందడుగు పడింది. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన ‘అస్త్ర’ బియండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) క్షిపణిని బుధవారం గోవా తీరంలో దాదాపు 20వేల అడుగుల ఎత్తు నుంచి తేజస్ యుద్ధ విమానం ద్వారా సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. ఈ ప్రయోగ పరీక్ష సక్సెస్ అయిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ మిస్సైల్‌ను గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ ప్రయోగం వల్ల తేజస్‌ ఫైటర్ జెట్ యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడడం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed