IT Minister Ashwini Vaishnav: మెక్రోసాఫ్ట్‌లో సాంకేతికం లోపం.. కేంద్ర IT మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

by Satheesh |
IT Minister Ashwini Vaishnav: మెక్రోసాఫ్ట్‌లో సాంకేతికం లోపం.. కేంద్ర IT మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం మెక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచలోని వివిధ దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా చూపడంతో పాటు బ్రిటన్‌లో రైలు ప్రయాణాలకు ఆటంకం కలిగించింది. ఆస్ట్రేలియాలో న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు, విమానాయాన సేవలపై ఈ ఎఫెక్ట్ పడగా.. భారత్‌లో ఐటీ, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. మెక్రోసాఫ్ట్‌ సర్వర్‌లో టెక్నికల్ ఇష్యూ కారణంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ప్లైట్ సర్వీస్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఈ క్రమంలో మెక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. మెక్రోసాఫ్ట్ ప్రతినిధులతో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. టెక్నికల్ ఇష్యూ రావడానికి గల కారణాలను గుర్తించామని.. అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఈఆర్టీ తగిన మార్గదర్శకాలు, సూచనలు ఇస్తుందని వెల్లడించారు. మెక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ఎఫెక్ట్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌పై ప్రభావం చూపించలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed