- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Budget: భారత్ నుంచి వెళ్లే వారికి పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి
దిశ, నేషనల్ బ్యూరో: భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన క్లియరెన్స్ సరిటిఫికేట్‌లను పొందడానికి తాజా బడ్జెట్‌లో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి దేశంలో నివశించే ఎవరైనా బ్లాక్ మనీ యాక్ట్ కింద స్పష్టంగా ఉన్నారని నిర్ధారిస్తూ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం అవసరం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం, భారత పౌరులు ఎవరైనా దేశం విడిచి వెళ్లడానికి ముందు పన్ను అధికారుల నుంచి సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ సదరు వ్యక్తికి చెల్లించాల్సిన పన్నులు లేవని, ఏదైనా బకాయి ఉంటే చెల్లించే ఏర్పాటు చేసినట్టు నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ ఆదాయపు పన్ను చట్టం, అలాగే పూర్తి సంపద పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, వ్యయ పన్ను చట్టాల కింద పన్నులకు వర్తిస్తుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ లేదా నియమాలు విడుదల అవుతాయని, అప్పుడు మరింత స్పష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, విదేశీ ఆస్తులు(రియల్ ఎస్టేట్ కాకుండా) మొత్తం విలువ రూ. 20 లక్షలకు మించని వాటిని నివేదించడంలో మీరు విఫలమైతే రూ. 10 లక్షలు ఉన్న జరిమానాను తొలగించాలని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. విదేశీ ఆస్తులను తప్పుగా లేదా రిపోర్ట్ చేయని వారికి కూడా వర్తిస్తుందని సమాచారం.