సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం

by Javid Pasha |   ( Updated:2023-05-18 10:58:48.0  )
సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం అభ్యర్థి విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధరామయ్యను కర్ణాటకకు కాబోయే సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇక సీఎం రేసులో చివరి వరకు బరిలో నిలిచిన కర్ణాటక పీసీసీ చీఫ్ సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక సీఎంగా సిద్ధరామయ్య ఈ నెల 20న (శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా తదితరులు హాజరుకానున్నారు.

ఇక పార్టీకి సంబంధించిన వారే కాకుండా యూపీఏ మిత్రపక్షాల వాళ్లకు ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూడా కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఈ వేడుకకు రానున్నట్లు తెలుస్తోంది.

Read more:

దీదీ సర్కార్కు బిగ్ షాక్.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

Advertisement

Next Story