M. K. Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

by Javid Pasha |   ( Updated:2023-11-05 06:28:03.0  )
M. K. Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన జ్వరం బారిన పడ్డారు. దీంతో స్టాలిన్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. వైరల్ ప్లూతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొద్దిరోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి స్టాలిన్‌ జలుబు, దగ్గు, జ్వరంతో అస్వస్థత చెందారని ఆయన వ్యక్తిగత వైద్యులు ప్రకటించారు. దీని కారణంగా అధికారిక కార్యక్రమాలు స్టాలిన్ రద్దు చేసుకున్నారు.

Advertisement

Next Story