- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ ఇండియాలో బీజేపీకి మరో షాక్.. పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా రాష్ట్ర చీఫ్ కామెంట్స్..?
దిశ, డైనమిక్ బ్యూరో: సౌత్ ఇండియాలో పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి కర్ణాటక ఫలితాల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ ప్రభావం నుంచి బయటపడి తాజా వ్యూహాలతో ముందుగు సాగాలని భావిస్తున్న కాషాయ పార్టీకి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి తీరు కొంపముంచబోతోందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలను బీజేపీ పెద్దలు ఖండించకపోతే ఆ పార్టీతో అన్నాడీఎంకే పొత్తు ప్రమాదంలో పడ్డట్లేనని అన్నాడీఎంకే నేత డి.జయకుమార్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషి అని కోర్టు నిర్ధారించిందన్నారు. అయితే ఈ కేసులో తీర్పు వచ్చేసరికి ఆమె దివంగతులయ్యారు. కాబట్టి సాంకేతికంగా ఆమెను దోషిగా తీర్పు చెప్పలేదు అంతే అన్నారు.
ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జయకుమార్ స్పందిస్తూ ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని నిర్వహించేందుకు అన్నామలై తగినవాడు కాదని ఆయన మాట్లాడేముందు జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఆయన మాటలను బీజేపీ పెద్దలు ఖండించకుంటే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ప్రమాదంలో పడినట్లేనన్నారు. గతంలో పని చేసిన అధ్యక్షులు పొత్తు ధర్మాన్ని పాటించారనీ.. కానీ ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు.
కాగా అన్నామలై తీరుపై గతంలోనూ విమర్శలు వినిపించాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని ఎదగాలని అన్నామలై ప్రయత్నాలు చేశారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. తాజాగా జయలలితపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాష్ట్ర అధ్యక్షుడి తీరు ఇలానే కొనసాగితే తమిళనాడులో బీజేపీకి ఏకైక మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే సైతం దూరం అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఇదే జరిగితే దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు బీజేపీ సైతం తమిళనాడులో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా పర్యవేక్షణలో అన్నామలై స్టాలిన్ ప్రభుత్వంపై ఎటాక్ తీవ్రం చేశారు. ఈ క్రమంలో అన్నాడీఎంకేపై స్టేట్ చీఫ్ వ్యాఖ్యలు కాకతాలియమైనవేనా లేక వ్యూహాత్మకమైనవా అనేది సస్పెన్స్‌గా మారింది.