సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాదుల నడ్డి విరిచాయి : రాజ్‌నాథ్ సింగ్

by Vinod kumar |
సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాదుల నడ్డి విరిచాయి : రాజ్‌నాథ్ సింగ్
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదుల నడ్డి విరిగిందని అన్నారు. దేశ సరిహద్దులు పూర్తిగా భద్రతతో ఉన్నాయని చెప్పారు. చైనాతో సందిగ్ధ పరిస్థితులు, పాకిస్తాన్‌తో ఆందోళనలకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తుందని చెప్పారు. గురువారం ఇండియా రైజింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం వంటి సమస్యలపై భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించిందని చెప్పారు. ప్రమాదాన్ని నిర్మూలించడానికి మద్దతును పొందడంలో విజయం సాధించిందని ఆయన అన్నారు. సర్జికల్స్ స్ట్రైక్స్ ద్వారా భారత బలం ఎంటో ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకున్న దేశాలనుద్దేశించి తమకు హాని తలపెట్టనంతవరకు ఎవ్వరి జోలికి వెళ్లమని, ఒకవేళ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే వదలిపెట్టమని చెప్పారు. సాంకేతికతో పాటు కమ్యూనికేషన్ రంగాలలో కనివిని మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం 6జీ పై పని చేయడం ప్రారంభించిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed