జల్లికట్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-09 04:57:06.0  )
జల్లికట్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని హింస అనలేమంది. ఈ క్రీడలో రక్తం చిందడం యాదృచ్ఛికం మాత్రమే నని స్పష్టం చేసింది. నెత్తురు కళ్ల చూడాలన్న ఉద్దేశంతో ఈ క్రీడలో పాల్గొనరని తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి తమిళనాడు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టును నెత్తుటి క్రీడ అని పిటిషనర్ తరపు న్యాయవాది అనగా అలా ఎలా అంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరూ ఆయుధాలు వాడరని, ప్రజలు ఈ క్రీడలో ఖాళీ చేతులతోనే పాల్గొంటారని తెలిపింది. హింస ఉండొచ్చు గానీ నెత్తుటి క్రీడ అనలేం అని స్పష్టం చేసింది.

Read More....

CM KCR , YS Jagan Mohan Reddy సెంటిమెంట్ వ్యూహం.. పేలిన మాటల తూటాలు

Advertisement

Next Story

Most Viewed