100 శాతం ‘ఈవీఎం- వీవీప్యాట్’ ఓట్ల ధ్రువీకరణ.. నేడు ‘సుప్రీం’ తీర్పు

by Hajipasha |
100 శాతం ‘ఈవీఎం- వీవీప్యాట్’ ఓట్ల ధ్రువీకరణ.. నేడు ‘సుప్రీం’ తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖను అక్కడే ఉండే వీవీప్యాట్‌ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఓ వైపు రెండోవిడత పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఈ కీలక తీర్పు వెలువడుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ తీర్పును వెలువరించనుంది. ఈ వ్యవహారంలో ఈసీని సవాలు చేసిన పిటిషనర్లలో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తదితరులు ఉన్నారు. బుధవారం రోజు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో ముడిపడిన పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ధర్మాసనం సంధించగా.. స్వయంగా ఈసీ నిపుణుల టీమ్ న్యాయస్థానికి వచ్చి సమాధానాలిచ్చింది. ఆ సమాధానాలన్నీ విన్నాక.. కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పనికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీకి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెలువడుతున్న తీర్పు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Advertisement

Next Story