వీవీప్యాట్లపై పిటిషన్‌ను ఏప్రిల్ 16న విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు

by S Gopi |
వీవీప్యాట్లపై పిటిషన్‌ను ఏప్రిల్ 16న విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: వీవీప్యాట్‌లో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ఏప్రిల్ 16న విచారిస్తామని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తెలిపింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వచ్చే మంగళవారం విచారణకు ఈ విషయంలోని అన్ని పిటిషన్‌లను పరీలిస్తామని తెలిపింది. ఏడీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోరిన నేపథ్యంలో ఇతర విషయాలతో పాటు విచారిస్తామని పేర్కొంది. ఓటర్లు వేసిన ఓటును వీవీప్యాట్ మిషన్ ద్వారా నిర్ధారించుకునేలా ఎన్నికల సంఘం, కేంద్రాన్ని ఆదేశించాలని ఏడీఆర్ తన పిటిషన్‌లో కోరింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ స్లిప్‌లను ధృవీకరించే విధానం కొనసాగుతోంది. దీనికి విరుద్ధంగా వీవీప్యాట్ స్లిప్పులన్నిటినీ లెక్కించాలని యాక్టివిస్ట్ అరుణ్ కుమార్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం, కేంద్రం వివరణ కోరింది.

Advertisement

Next Story

Most Viewed