Supreme Court: ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లపై సుప్రీం కోర్టు సీరియస్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

by Shiva |   ( Updated:2024-08-05 07:53:31.0  )
Supreme Court: ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లపై సుప్రీం కోర్టు సీరియస్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో వరద ఉధృతితో రావూస్‌ ఐఏస్‌ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటనను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ సర్కార్‌తో పాటు కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా అభ్యర్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆటలాడుతున్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఘటన ఓ కనువిప్పు కావాలని న్యాయమూర్తులు అన్నారు. ఇక నుంచి అన్ని భద్రతా ప్రయాణాలు పాటించే కోచింగ్ సెంటర్లకే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌లో డ్రైనేజీ వ్యవస్థ, సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో నేరపూరిత హత్య, ఇతర అభియోగాల కింద అరెస్ట్ అయిన కోచింగ్ సెంటర్‌ ఎండీ అభిషేక్‌ గుప్తా, కో-ఆర్డినేటర్‌ దేశ్‌పాల్‌‌సింగ్‌కు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Advertisement

Next Story

Most Viewed