- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme court: రాజీ మార్గంతో లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేము.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దిశ, నేషనల్ బ్యూరో: ఫిర్యాదు దారుడు, నిందితుడి మధ్య రాజీ కుదర్చడం ద్వారా లైంగిక వేధింపుల కేసును కొట్టవేయలేమని సుప్రీంకోర్టు (Supreme court) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ఉపాధ్యాయుడికి ఉపశమనం కల్పిస్తూ గతంలో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan high court) ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సయోధ్య కుదిరిందని చెప్పి కేసు క్లోజ్ చేయడం ఏంటని హైకోర్టును ప్రశ్నించింది. 2022లో రాజస్థాన్ లోని గంగాపూర్ నగరంలో ఒక టీచర్ తన విద్యార్థినిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం (Posco Act) కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక కుటుంబం, నిందితుడి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. స్టాంప్ పేపర్‌పై కుటుంబ సభ్యుల నుంచి నిందితుడు వాంగ్మూలాన్ని పొందాడు. తాము తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
దీంతో తనపై ఉన్న కేసు కొట్టివేయాలని నిందితుడు దిగువ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది.ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించగా, రాజీ పత్రాన్ని అంగీకరించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుడిపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. రాజీ మార్గం ద్వారా లైంగిక వేధింపుల కేసును కొట్టివేయలేమని తేల్చి చెప్పింది.