- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోర్టు స్టే ఆర్డర్ ఆటోమేటిక్‌గా ముగియదు: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకీభవించేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కేసుల పరిష్కారానికి కాలక్రమాన్ని నిర్ణయించడం మానుకోవాలని.. దీన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేయగలుగుతారని తీర్పులో సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై న్యాయస్థానం గురువారం రెండు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. కానీ రెండింటిలోనూ ఒకేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టుల స్టే ఆర్డర్‌లను ప్రత్యేకంగా పొడిగించకపోతే అవి ఆటోమేటిక్‌గా రద్దవుతాయని 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించారు.