సందేశ్ ఖాలీ కేసులో దీదీ సర్కారుకు ఊరట.. సీబీఐ పోరుపై గెలుపు

by Shamantha N |
సందేశ్ ఖాలీ కేసులో దీదీ సర్కారుకు ఊరట.. సీబీఐ పోరుపై గెలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్‌ఖాలీ కేసులో బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. మమతా బెనర్జీ సర్కారు సమ్మతి లేకుండా సందేశ్ ఖాలీ కేసులో సీబీఐ విచారణ చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని కోర్టు పేర్కొంది. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో వాస్తవాలు దాగి ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. డీఎస్పీఈ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రంపై బెంగాల్ ఎలాంటి కేసు పెట్టలేదని చెప్పలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 13న జరగనుంది. ఇటీవలే సందేశ్‌ ఖాలీ వేధింపులు, భూకబ్జాలకు సంబంధించిన కేసులపై సీబీఐ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

సందేశ్ ఖాలీ ఘటన

కాగా, తమ భూములను కబ్జా చేయడంతో పాటు తమను లైంగికంగా వేధిస్తున్నాడని టీఎంసీ నేత షాజహాన్ కు వ్యతిరేకంగా బెంగాల్ లోని సందేశ్ ఖాలీ ప్రాంత మహిళాలు ఉద్యమించారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన సీబీఐ.. షాజహాన్ ను అరెస్ట చేసి జైలుకు పంపింది.

Advertisement

Next Story