‘ది కేరళ స్టోరీ’ మూవీకి లైన్ క్లియర్..

by Vinod kumar |
‘ది కేరళ స్టోరీ’ మూవీకి లైన్ క్లియర్..
X

న్యూఢిల్లీ: ద్వేషపూరిత ప్రసంచం, ఆడియో-విజువల్ ప్రచారం వంటి కారణాలతో 'ది కేరళ స్టోరీ' చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది.శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం 16 మిలియన్ల వ్యూస్‌ను సాధించిందని జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో న్యాయవాది నిజాం పాషా విన్నవించారు. ఈ సినిమాలో దారుణమైన విద్వేష ప్రసంగం ఉందని, ఇది పూర్తిగా ఆడియో-విజువల్ ప్రచారమని పాషా అన్నారు. అయితే దీనికి ధర్మాసనం సమాధానమిస్తూ.. ‘విద్వేష ప్రసంగాలు చాలానే ఉన్నాయి.

ఈ సినిమాకు బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక వ్యక్తి పోడియం వద్దకు వచ్చిన తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడం లాంటిది కాదు. సినిమా విడుదలను సవాల్ చేయాలనుకుంటే.. సరైన పద్ధతిలో సర్టిఫికేషన్‌ను సవాల్ చేయండి’ అని పేర్కొంది. పిటిషనర్ ముందుగా హై కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ నాగరత్న అన్నారు. అయితే సినిమా విడుదలకు తక్కువ సమయం ఉందని పాషా చెప్పారు. ఇది మైదానం కాదు.. లేదంటే అందరూ సుప్రీం కోర్టుకు రావడం మొదలు పెడతారని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో తాను సలహా ఇవ్వలేకపోవచ్చు కానీ.. తగిన ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం బలమైన రిట్ పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ జోసెఫ్ సూచించారు. ఈ చిత్రాన్ని మతమార్పిడి నేపథ్యంతో హిందీలో తీశారు.

Advertisement

Next Story