ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం

by GSrikanth |
ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, స్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జే.బి. పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత మూడు రోజులుగా విచారణ జరిపింది. ఇవాళ జరిగిన వాదనల సందర్భంగా 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed