Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

by S Gopi |
Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశా ఫౌండేషన్‌పై హెబియస్ కార్పస్ రిట్ దాఖలైన నేపథ్యంలో విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్‌పై నమోదైన కేసుల వివరాలను సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈశా ఫౌండేషన్‌కు ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ, ఆశ్రమంలో సోదాలు నిలిపేయాలని పోలీసులను ఆదేశించింది. తన ఇద్దరు కమార్తెలను దశాబ్దం కాలం నుంచి ఆశ్రయంలో బంధించారంటూ తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రిట్ దాఖలు చేశారు. తమతో సంబంధాలు లేకుండా చేసినట్టు ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సదరు మహిళలను ఆన్‌లైన్‌లో సంప్రదించి మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే వారిద్దరూ ఆశ్రమంలో ఉంటున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు చెప్పారు. దాంతో మద్రాసు హైకోర్టు ఆదేశాలను నిలిపేసింది. అలాగే, ఈశా యోగాశ్రమానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.

Next Story