Supreme Court: దీపావళి వేళ క్రాకర్స్‌ అధికంగా పేల్చడంపై సుప్రీంకోర్టు ఫైర్

by Gantepaka Srikanth |
Supreme Court: దీపావళి వేళ క్రాకర్స్‌ అధికంగా పేల్చడంపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది దీపాలతో పాటు టపాసులు. అందుకే ఈ పండుగ కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టపాసులు(Crackers) పేల్చడం మూలంగా వచ్చే పొల్యూషన్‌(Pollution)ను ఏమాత్రం పట్టించుకోకుండా విపరీతంగా బాంబులు(Crackers) పేలుస్తుంటారు. ముఖ్యంగా ఈ దీపావళి(Diwali) వేళ దేశ రాజధాని ఢిల్లీలో భయంకరంగా టపాసులు(Crackers) పేల్చారు. దీంతో వాతావరణం భారీ స్థాయిలో పొల్యూట్ అయింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. పొల్యూషన్‌ విషయంలో చర్యలెందుకు తీసుకోవడంలేదని మండిపడింది. నిబంధనలు కఠినంగా అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed