- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > Supreme Court: ఢిల్లీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎంసీడీ సభ్యుల నియామకంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఢిల్లీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎంసీడీ సభ్యుల నియామకంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం కోర్టులో ఢిల్లీ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కి ప్రభుత్వ అనుమతి లేకుండా సభ్యులను నామినేట్ చేసే అధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. సభ్యుల నియామకం చట్టబద్ధమైన అధికారమేనని.. కార్యనిర్వాహక అధికారం కాదని ధర్మాసనం పేర్కొంది. 1993 ఎంసీడీ చట్టం ప్రకారం.. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహా ప్రకారం కాకుండా స్వతంత్రంగా వ్యవహరించవచ్చని కోర్టు తెలిపింది. కాగా, ఎంసీడీలో 10 మంది సభ్యులను నామినేట్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకే ఎంసీడీ సభ్యులను నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Advertisement
Next Story