- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sultan Of Brunei: బ్రూనై సుల్తాన్ హస్సనాల్ బోల్కియాకు విలాస జీవితం
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. కాగా.. ఆ దేశ సుల్తాన్ హస్సనాల్ బోల్కియా గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో బ్రూనై సుల్తాన్ ఒకరు. కాగా.. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్- 2 తరువాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తిగా సుల్తాన్ చరిత్రకెక్కారు. ఆయన విలాసవంతమైన జీవితాన్ని చూస్తే.. ఎవరైనా షాక్ కావాల్సిందే. సుల్తాన్ దగ్గర అత్యధిక సంఖ్యలో ఖరీదైన ప్రైవేటు కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు(సుమారు 4 లక్షల కోట్లు) ఉండగా.. ఆయన సంపద 30 బిలియన్ డాలర్లుగా ఉంది.
సుల్తాన్ పేరిట గిన్నీస్ వరల్డ్ రికార్డ్
బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచే సుల్తాన్ కు ఆదాయం ఎక్కువ. ఆయన దగ్గర సుమారు ఏడు వేల లగ్జరీ వాహనాలు ఉన్నాయి. సుల్తాన్ పేరిటే ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్టే ఉంది. ఏడవేల లగ్జరీ కార్లలో 600 రోల్స్ రాయిస్ కార్లు, 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్ కార్లు ఉండగా.. ఆయన కలెక్షన్లలో ప్రత్యేక ఆకర్షణ బెంట్లీ డామినేటర్ ఎస్‌యూవీదే. దాని విలువ సుమారు 80 మిలియన్ డాలర్లు. పోర్షె 911 హారిజన్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-2 కార్లు ఉన్నాయి. కస్టమ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది.
గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారు
సుల్తాన్ కూతురు, యువరాణి మజేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును సుల్తాన్ కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ అయిన ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ లో ఆయన నివసిస్తారు. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని 1984లో నిర్మించారు. సుల్తాన్ ఇంటి ధర రూ.2,250 కోట్లు కాగా.. 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, 5 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఆయనకు సొంతంగా 110 గ్యారేజీలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ జూ కూడా ఉంది. అందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. సుల్తాన్ కు సొంతగా బోయింగ్ 747 విమానం కూడా ఉంది.