Nagavamshi: ఐకాన్ స్టార్-త్రివిక్రమ్ సినిమాపై స్టార్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్..!!

by Anjali |   ( Updated:2024-10-25 15:11:56.0  )
Nagavamshi: ఐకాన్ స్టార్-త్రివిక్రమ్ సినిమాపై స్టార్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)-త్రివిక్రమ్(Trivikram) సినిమాపై తాాజాగా ఓ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బన్నీ మరికొద్ది రోజుల్లో పుష్ప-2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే పుష్ప-2 (Pushpa-2) తర్వాత ఐకాన్ స్టార్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో జతకట్టనున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈ నిర్మాత వ్యాఖ్యలు బన్నీ అభిమానుల్లో మరింత జోష్ నింపాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపాడు. వచ్చే సంవత్సరం జనవరిలో స్పెషల్ ప్రోమోతో మూవీని ప్రకటిస్తామని వెల్లడించాడు. అలాగే మార్చి నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేస్తామని అన్నాడు.

అదే నెలలో ఐకాన్ స్టార్ షూటింగ్ లో పాల్గొననున్నారని పేర్కొన్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో దర్శకధీరుడు జక్కన్న ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశాడని, ఆయనను కూడా టచ్ చేయని జానర్ లో ఈ మూవీ ఉంటుందని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపాడు. ఈ చిత్రంతో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నామని నాగవంశీ(Nagavanshi) వెల్లడించారు. అలాగే ఒక సంవత్సరంలో 3, 4 ప్రముఖ హీరోల సినిమాల టికెట్ల రేట్లు పెంచుతున్నట్లు వివరించాడు. పెద్ద మూవీలకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వారం రోజుల టికెట్ల ధరలు పెంచుతామని నిర్మాత వెల్లడించాడు. కానీ ప్రజల దగ్గర మనీ తీసుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని తెలిపాడు.

Advertisement

Next Story