కోకాపేటలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

by Rani Yarlagadda |   ( Updated:2024-10-25 05:08:15.0  )
కోకాపేటలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
X

దిశ, గండిపేట్ / వెబ్ డెస్క్: ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కోకాపేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగప్రభాకర్‌(27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని తణుకుకు చెందిన నాగప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగప్రసాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కోకాపేటలోని విరూపాక్ష మెన్స్ హాస్టల్‌ భవనం పైనుంచి ఒక్కసారిగా దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, హాస్టల్ సిబ్బంది వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో నాగ ప్రభాకర్ అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Advertisement

Next Story