15 రోజులుగా నీళ్లు రావడం లేదు..బిందెలతో ఆందోళనకి దిగిన మహిళలు

by Aamani |
15 రోజులుగా నీళ్లు రావడం లేదు..బిందెలతో ఆందోళనకి దిగిన మహిళలు
X

దిశ, తూప్రాన్ : 15 రోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని మహిళలు ఆందోళనకి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయపల్లి గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం ఉదయం బిందెలతో గ్రామపంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మినీ ట్యాంకులో నీరు తాగి దురద విష జ్వరాలు వస్తున్నాయని బిందెలకు చిలుము పట్టి తీవ్ర అవస్థలకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎదురుగా నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ అధికారులపై నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిందెలను కింద కొట్టి లొల్లి చేశారు.వెంటనే నాయకులు అధికారులు స్పందించి త్రాగు నీరు వచ్చేదాకా గ్రామ పంచాయతీ దగ్గర ఉంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed