సుడాన్‌లో ఉద్రిక్తం.. బుల్లెట్ గాయంతో మరణించిన భారత పౌరుడు

by Vinod kumar |
సుడాన్‌లో ఉద్రిక్తం.. బుల్లెట్ గాయంతో మరణించిన భారత పౌరుడు
X

ఖర్తోమ్: సుడాన్‌లో ఆధిపత్యం కోసం ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షలు తీవ్రమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 56 మంది మరణించగా, సుమారు 600 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ దాడుల్లో భారత్ కు చెందిన వ్యక్తి బుల్లెట్ గాయంతో మరణించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ నిర్ధారించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ఖర్తోమ్ లో భారతీయుుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితులు ఇంకా అందోళనకరంగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులతో మానిటర్ చేస్తున్నామని తెలిపారు. దేశ రాజధానిలో భయానక దృశ్యాలు నెలొకన్నాయి.

అనేక ప్రాంతాల్లో కాల్పులు, పేలుళ్లతో దద్దరిలుతున్నాయని స్థానికులు చెప్పారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. సూడాన్ సరిహద్దు దేశమైన చడ్ ప్రభుత్వం తాత్కాలికంగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు కాల్పులు విరమణ చేపట్టాలని ఇరు వర్గాలను కోరాయి. కాగా, ఇప్పటికే భారత పౌరులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లొద్దని భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, సాధారణ సైన్యంలోకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ని ప్రణాళికాబద్ధంగా ఏకీకృతం చేయడంపై సైనిక నాయకుడు అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వివాదంతో హింస చెలరేగింది.

Advertisement

Next Story