Bomb threats: విమానాలకు బెదిరింపు ఘటనలపై కేంద్రం చర్యలు

by Shamantha N |   ( Updated:2024-10-17 10:44:59.0  )
Bomb threats:  విమానాలకు బెదిరింపు ఘటనలపై కేంద్రం చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నాలుగు రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఫ్లైట్ సర్వీసులు రూటు మార్చడంతో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే, ఇలాంటి పనులు చేసే ఆకతాయిలను ఆటకట్టించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఆ దిశగా పౌర విమనయాన శాఖ సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల్లోనే 20కి పైగా బెదిరింపులు వచ్చాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. వీటిపై చేపట్టన విచారణలో అన్నీ నకిలీవేనని తేలాయి. దీంతో, ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలకు పూనుకుంది. నిందితులను నో- ఫ్లై లిస్ట్‌లో యాడ్‌ చేయాలని చూస్తోంది. అంతే కాదు అలాంటి వారికి కఠిన శిక్షలు వేసేలా ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’ (BCAS)లో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నిబంధనల్లో మార్పులు చేసేందుకు అభిప్రాయాలను సేకరిస్తోంది.

ఇప్పటికే పలు నిబంధనలు

విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన వారికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నాయి. పలు నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే సోషల్‌మీడియా నుంచి వచ్చే బాంబు బెదిరింపులు లాంటి సందర్భాలు ఎదురైతే శిక్షించేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతుండటంతో కేంద్రం.. వీటి కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చేందుకు చూస్తోంది.

Advertisement

Next Story